తిరుమలలో టీటీడీ ప్రధాన అర్చకులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడారు. వంశపారపర్యంగా వస్తున్న అర్చకుల హక్కులు గత ప్రభుత్వం రద్దు చేయడంతో అర్చకులు చాలా నష్టపోయారని అన్నారు. చాలా ఆలయాలు మూతపడ్డాయన్న ఆయన సీఎం జగన్ అర్చకులకు న్యాయం చేస్తామని గతంలో హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చినా…. సాంకేతికపరమైన కారణాలు వలన అర్చకులకు వయోపరిమితి నిబంధనల సడలింపు ఆలస్యమైందని అన్నారు.
ధర్మాన్ని భగవంతుడు రక్షించినట్టు…. అర్చకులు వంశపారంపర్య హక్కులు సీఎం జగన్ పరిరక్షిస్తున్నారని అన్నారు. దేవాలయాలకు పునర్వైభవాన్ని సీఎం జగన్ కల్పిస్తారని నమ్మకం కలిగిందన్న అయన పింక్ డైమండ్ అంశం కోర్టులో వుంది… వాటిపై ఇప్పుడు స్పందించను అంటూ దాట వేశారు. ఆలయాలను, అర్చకులను రాజకీయంగా వాడుకోవడం మంచి పద్ధతి కాదు… ఆ దురాచారం పోవాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. రాజు క్షేమంగా ఉండాలని దేవుని దగ్గర ప్రార్దిస్తాం… రాజు ఎవరు అన్నది మాకు సంబంధం లేదు అని అన్నారు.