పాలల్లో నెయ్యి కలుపుకుంటే కలిగే ప్రయోజనాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

-

వినడానికి విచిత్రంగా ఇది నిజంగా నిజమే. పాలతో తయారయ్యే నెయ్యిని మళ్ళీ పాలల్లో కలుపుకోవడం ఏంటి విచిత్రం కాకపోతే అని అనుకుంటున్నారా? అవును, అది నిజమే. రొట్టె ముక్కల్ని నెయ్యిలో కాల్చుకు తినడమో, అన్నంలో నెయ్యిని కలుపుకోవడమో చేస్తుంటాం. కానీ ఇలా కొత్తగా పాలల్లో నెయ్యి కలుపుకుని ఎప్పుడూ తాగము. అలా తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో ఇక్కడే తెలుసుకుందాం.

నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉండడంతీ నెయ్యిని సూపర్ ఫుడ్ ఆ పిలుస్తారు. పాలల్లో నెయ్యిని కలుపుకుని తాగితే వచ్చే ప్రయోజనాలివే..

కీళ్ళను బలపరుస్తుంది

పాలల్లో ఉన్న విటమిన్ డి ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుంది. ఇది శరీరానికి బాగా వంటబట్టడానికి నెయ్యి మేలు చేస్తుంది. ఎముకల కీళ్ళలో పుట్టే మంటని నెయ్యి తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.

కంటిచూపు మెరుగవుతుంది.

ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఆవు పాలల్లో వేసి పొద్దున్న పూట తాగడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది.

బలాన్ని పెంచుతుంది

ఏదైనా పని చేసి అలసిపోయినట్లుగా అనిపిస్తే పాలల్లో నెయ్యి వేసుకుని తాగండి. అది మీకు బలాన్ని తెచ్చి పెట్టి శక్తివంతంగా ఉంచుతుంది.

మెదడు పనితీరును పెంచుతుంది

నెయ్యిని పాలల్లో తీసుకోవడం వల్ల ప్రతీ కణజాలానికి సరైన శక్తి అందుతుంది. దానివల్ల మెదడు పనితీరు బాగా పెరుగుతుంది. పిల్లల్లో జ్ఞాపక శక్తి, తెలివితేటలు పెంపొందించడానికి పాలల్లో నెయ్యి వేసి తాగించండి.

గర్భిణీ స్త్రీలకు

గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఎముకలకి బలం చేకూరుతుంది. పాలిచ్చే తల్లులకి బాగా మేలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version