“రామారావు ఆన్ డ్యూటీ” రిలీజ్ డేట్ ఫిక్స్

-

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను s.l.v. సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా… దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించింది చిత్రబృందం. క్రిస్మస్ నేపథ్యంలో… రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మార్చి 25వ తేదీన రామారావు ఆన్ డ్యూటీ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్లు ప్రకటన చేసింది చిత్రబృందం. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా వదిలింది. ఇదిలా ఉండగా రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version