BRS అంటే బెకార్, బందిపోట్ల రజాకార్ సమితీ – విజయశాంతి

-

BRS అంటే బెకార్, బందిపోట్ల రజాకార్ సమితీ అని విజయశాంతి ఫైర్ అయ్యారు. అధికార టీఆర్ఎస్ పార్టీ పేరు నుంచి “తెలంగాణ”ను తొలగించడం ద్వారా తనకు ఇక తెలంగాణతో ఎలాంటి అవసరం లేదని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పేశారు. గతంలో టిఆర్ఎస్ పార్టీని గానీ, పార్టీ అధినేత కేసీఆర్‌ని గానీ, ఈ పార్టీ నేతలని గాని ఎవరైనా పల్లెెత్తు మాట అంటే చాలు… వారిపై తెలంగాణ ద్రోహి అని ముద్ర వేసి నానా యాగీ చేసేవారని ఆగ్రహించారు.

 

ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకంగా తన పార్టీ పేరు నుంచే తెలంగాణను తొలగించి అసలైన తెలంగాణ ద్రోహి తానేనని నిరూపించుకున్నారు. టిఆర్ఎస్ పేరును మార్చుతూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలు తప్ప ప్రజల నుంచి ఎంత మాత్రం మద్దతు లేదు. కేసీఆర్ చర్యపై సోషల్ మీడియాలో ఆగకుండా వెల్లువెత్తుతున్న మీమ్స్, ట్రోల్సే అందుకు రుజువు. ఒకపక్క తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే దేశాన్ని ఉద్ధరిస్తానంటూ కేసిఆర్ చేస్తున్న ఈ హడావిడి చూసి… ఇంతకంటే ఎక్కువగానే రంకె లేసిన ఉత్తరాది పార్టీలు ఎస్పీ, బీఎస్పీలను… కమ్యూనిస్టు పార్టీలను అందరూ గుర్తుచేసుకుంటున్నరు. టిఆర్ఎస్‌ని పట్టిపీడిస్తున్న లిక్కర్ స్కాం మకిలిని వదిలించుకోలేక… గులాబీ దళం అవినీతిపై కేంద్రం పెట్టిన నిఘా నుంచి తప్పించుకోలేక… బిజెపి సర్కారుతో తలపడేందుకే కేసీఆర్ ఈ బీఆర్ఎస్ బాట పట్టారని అందరికీ అర్థమైందన్నారు.

 

 

ఒకప్పుడు తెలంగాణ ప్రజలను పీడించిన నాటి ఎంఐఎం నాయకత్వంలోని రజాకార్లు కూడా ఇలాగే అప్పటి భారత ప్రభుత్వంతో యుద్ధం అంటూ తుపాకీ రాముడి కబుర్లు చెప్పి తుర్రుమన్న విషయాన్ని కెసిఆర్ గుర్తుంచుకుంటే మంచిది.ఈ BRS…. బంగాళాఖాత రాష్ట్ర సమితో, బెకార్ రాష్ట్ర సమితో, బందిపోట్ల రజాకార్ సమితో ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ఎంతమాత్రం ఇకపై తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు అని స్వయంగా కేసిఆర్ గారు చెప్త్పున్న మాట అర్ధం చేసుకుంటున్నారు మన తెలంగాణ ప్రజలు అన్నారు విజయశాంతి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version