తన డాన్స్ తో పాటకే అందం తెచ్చిన రమ్యకృష్ణ.. వీడియో వైరల్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రమ్యకృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక గతంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది. మళ్లీ ఎన్నో సంవత్సరాల తర్వాత బాహుబలి సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం హీరోయిన్లకు సమానంగా రెమ్యూనరేషన్ అందు కుంటు దూసుకుపోతోంది రమ్యకృష్ణ. ఇప్పుడు తాజాగా బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్ని షోలలో కూడా ఎంట్రీ ఇచ్చింది.

అల్లు అరవింద్ స్థాపించిన అహ ఓటిటి సంస్థలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లే కాకుండా డాన్స్ షో వంటివి కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతోంది. ప్రస్తుతం ఆహా టీమ్” డాన్స్ ఐకాన్” అనే టైటిల్ తో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ షోకు అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరిస్తోంది అందుకు సంబంధించి ఒక ప్రోమోన్ కూడా విడుదల చేశారు. ఇందుకు హోస్ట్ గా మాత్రం ఓంకార్ వ్యవహరిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ పక్కన మరొక జడ్జిగా శేఖర్ మాస్టర్ వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా శేఖర్ మాస్టర్ రమ్యకృష్ణతో కలిసి చేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.

రమ్యకృష్ణ రెడ్ కలర్ శారీలో చాలా హాట్ గా మెరిసిపోతూ ఉన్నది. అప్పటికి ఇప్పటికీ అదే స్టైల్ ని మెయింటైన్ చేస్తూ తన డాన్స్ తో అదరగొడుతోంది రమ్యకృష్ణ. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమాలోని సామజ వర గమన అనే పాట కు శేఖర్ మాస్టర్ తో కలిసి ఈమె డాన్స్ వేయడం జరిగింది. ఈ డాన్స్ చూసిన శ్రీముఖి మేడం సార్ మేడమ్ అంతే అంటూ కామెంట్ చేయడం జరుగుతోంది. నిజంగానే రమ్యకృష్ణ అలా స్టేజి పైన నడుచుకుంటూ వస్తూ ఉంటే అలానే కనిపిస్తోందని చెప్పవచ్చు.మొదటిసారి బుల్లితెరపై రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరిస్తోంది.అందుకు గాను రెమ్యూనరేషన్ కూడా భారీగానే పుచ్చుకుంటుంది ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version