రంజాన్ పండుగ.. ఉద్యోగులకు సర్కార్ బంపర్ ఆఫర్

-

రంజాన్ పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వరకే ముస్లింలకు సమయ పాలనలో వెసులుబాటు ఇవ్వగా.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. మార్చి 2 నుంచి 31వ తేదీ వరకు దుకాణాలను 24 గంటలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.

ఈ మేరకు రాష్ట్ర కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా సిబ్బంది ఎవరైనా రోజుకు 8 గంటలకు మించి, వారానికి 48 గంటలు మించి పని చేస్తే ఓనర్స్ రెట్టింపు వేతనాలు ఇవ్వాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక సెలవు దినాల్లో పనిచేస్తే ప్రత్యామ్నాయ లీవ్ ఇవ్వాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం 4 గంటలలోపే వెళ్లేందుకు పర్మిషన్ మంజూరు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news