ఈనెల 23న ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తిచేయగా.. గ్రూప్ -2 మెయిన్స్ ఎగ్జామ్ నిలిపివేయాలని దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నిర్వహించే గ్రూప్-2 ప్రధాన పరీక్షను ఆపాలని అభ్యర్థులు వేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.
దీంతో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు.గ్రూప్-2 పరీక్షల్లో రోస్టర్ లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో స్టడీ సెంటర్ల వద్ద ఆందోళనకు దిగారు. రోస్టర్ విధానంలోని లోపాలను సరిచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రోస్టర్ లోపాల వలన చాలా మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. దీనిపై ఏపీ సర్కార్ వెంటనే స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.