రానా ఆంటీ, మిహీకా బజాజ్ మదర్ బంటీ బజాజ్ షేర్ చేసిన ఫొటోలు ఇన్స్టా లో సందడి చేస్తున్నాయి. మేలో తను ప్రేమిస్తున్నానని, తను ప్రేమిస్తున్న ఆమ్మాయి ఈమే అంటూ రానా తన ప్రేయసి మిహీకా బజాజ్ ఫొటోని షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో ఆగస్టు 8న రానా, మిహీకాల వివాహం జరిగింది.
పెళ్లి తరువాత కొంత విరామం తీసుకున్నా రానా జంట హానీమూన్ వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోలని రానా వైఫ్ మిహీకా బజాజ్ ఇన్స్టాలో షేర్ చేసింది. తాజాగా పెళ్లి తరువాత తొలి ఫెస్టివల్ కావడంతో రానా తన భార్యతో కలిసి అత్తారింట్లో పండగని ఎంజాయ్ చేశారు. అత్తరాఇంట్లో కొత్తల్లుడు రానా సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవులున్నాయి.