బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తన అభిమానులు, సినీ లవర్స్ కు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇటీవల తన లవర్ ఆలియా భట్ ను మ్యారేజ్ చేసుకున్న రణ్ బీర్..తన సినిమాలను వరుసగా విడుదల చేయబోతున్నారు.
‘బ్రహ్మాస్త్ర’లో తన భార్యతో కలిసి నటించిన రణ్ బీర్..ఇందులో ‘శివ’గా అభిమానులు, సినీ ప్రియులను పలకరించనున్నారు. ఆ తర్వాత ‘షంషేరా’ సినిమాలో ఊహించని గెటప్ లో కనిపించనున్నారు.
తాజాగా ‘షంషేరా’ లుక్ ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది. అందులో పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో అసలు గుర్తుపట్టని విధంగా రణ్ బీర్ కపూర్ ఉన్నారు. ఈ లుక్ తో అభిమానులకు రణ్ బీర్ కపూర్ షాక్ ఇచ్చారు. అయితే, ఇది అఫీషియల్ లుక్ కాదు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ ‘షంషేరా’ను ప్రొడ్యూస్ చేస్తోంది. ఇందులో వాణి కపూర్ , సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే నెల 22న ఈ పిక్చర్ రిలీజ్ కానుంది.