రీమేక్ సినిమాలపై రణబీర్ కపూర్ వైరల్ కామెంట్స్..

-

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తాజాగా రీమేక్ సినిమాలపై వైరల్ కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు తాను ఎందుకు రీమేక్ సినిమాల్లో నటించలేదో చెప్పుకొచ్చారు..

బాలీవుడ్లో ఏ విషయాన్నినైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి రన్బీర్. ఇప్పటికే పలు విషయాల్లో తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పుకొచ్చిన రన్బీర్ తాజాగా తాను ఎందుకు రీమేక్ సినిమాల్లో నటించనో తెలిపారు. అంతేకాకుండా తనకు ఈ విషయంపై అసలు ఆసక్తి ఉండదని చెప్పారు.

ఒక భాషలోసూపర్ హిట్ అయిన సినిమాలను మళ్ళీ ఇంకో భాషలో రీమేక్ చేయడంలో అర్ధం లేదనన్నారు.
అలాగే “రీమేక్‌ సినిమాలకు, పాటలకు నేను వ్యతిరేకం అన్నారు.ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ తెరకెక్కించడం కొత్తగా ఏముంటుంది. ఏ కొత్తదనం పంచుతుంది. ఏమాత్రం కొత్తగా అనిపించని రీమేక్ సినిమాలు ఆడియన్స్ కు ఎందుకు ఇష్టం ఉంటాయి. ఒక కథను సాధ్యమైనంత సృజనాత్మకంగా రూపొందించిన తర్వాత మరోసారి ఆ కథలో ఆకట్టుకునే అంశం ఏముంటుంది. హీరోగా ఒక కొత్త కథను ప్రేక్షకుల దగ్గరకు తీసుకొచ్చే స్థాయిలో నేనున్నాను. అదే ప్రయత్నాన్ని చేస్తా. నా కెరీర్‌ స్టార్టింగ్ లో బచ్నా ఏ హసీనో సినిమాలో ఓ పాటను రీమిక్స్‌ చేశాను. అప్పుడు దర్శకులకు వద్దని చెప్పేంత ధైర్యం నాలో ఉండేది కాదు.. కాని ఇప్పుడు చెపుతున్నా… రీమేక్ కథలు కాని. రీమేక్ పాటలు కాని..రీమేక్ సినిమాల జోలికి నేను వెళ్ళాను. ఎవరైనా రీమిక్స్ సినిమాలు తీస్తే అది కచ్చితంగా మాతృభాషలో సాధించినంత విజయం అయితే సాధించదు. 100 కి 100% సినిమా ఖచ్చితంగా అభిమానుల్ని ఆకట్టుకుంటుందని నమ్మకం లేదు ఇలాంటప్పుడు సమయాన్ని వృధా చేసుకోవటం అనవసరమైన విషయం..” అంటూ చెప్పకొచ్చారు రన్బీర్ కపూర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version