దొంగ ఓట్లపై గెలవడంపై రాపాక మరో సంచలన ప్రకటన.. నవ్వుకునేందుకు చెప్పిన మాటలే !

-

దొంగ ఓట్లపై గెలవడంపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కీలక ప్రకటన చేశారు. ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జరిగిన సందర్భాన్ని ఆత్మీయ సమ్మేళనంలో ప్రస్తావించానని..దానిని ఇప్పుడు జరిగి నట్లు ప్రచారం చేయడం తగదని వెల్లడించారు. సదరు వ్యాఖ్యలు అందరూ నవ్వుకునేందుకు చెప్పిన మాటలేనని.. సీరియస్ గా చెప్పినవి కావని తెలిపారు. టిడిపిలో విమర్శలు చేస్తే.. జనసైనికులు ఆందోళన చేయడం ఎందుకు ? అని ప్రశ్నించారు.

2019లో రాపాక 810 ఓట్ల స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించానని.. అంతకుముందు తొలిసారి 2009లో కాంగ్రెస్ తరఫున 4,600 ఓట్ల ఆధిక్యంతో గెలిచానని వివరించారు. బొంగు రాజేశ్వరరావు చేతకాని దద్దమ్మ అని.. రాష్ట్రం అంతా వైసిపి 151 సీట్లు గెలిస్తే సత్తా లేక బొంతు రాజోలులో ఓడిపోయాడని ఫైర్‌ అయ్యారు. ఇప్పటికి ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి నన్న ప్రలోభ పెట్టినట్లు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా….గత ఎన్నికల్లో నాకు ఓటు వేసింది జనసైనికులే, ఎస్సీలు వైసిపికి వేశారన్నారు. నేను వైసిపిలోకి వచ్చానని బొంతు వర్గం ఆత్మీయ సమావేశం పెట్టి ఆహ్వానించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version