రాష్ట్రంలో వరసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటను అందరిని కలవరపరుస్తున్నాయి. మహిళలకు రక్షణ కరువయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. మహిళా రక్షణగా నిర్భయ, దిశ వంటి అనేక చట్టాలు వచ్చిన కామాంధుల తీరు మారడం లే దు.ఒంటరిగా, నిస్సాహయంగా కనిపించే మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని సంఘటనల్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నా కొందరి మగాళ్ల తీరులో మార్పు రావడం లేదు
. సింగరేణి కాలనీ అత్యాాచార ఘటన మరవక ముందే నల్గోండ మహిళపై అత్యాచారం తాజాగా నిజామాబాద్ లో యువతిపై సామూహిక అత్యాచారాలు చోటుచేసుకున్నాయి. తాజాగా బంజారాహిల్స్ మరో యువతిపై అత్యాచార ఘటన జరిగింది. ఇంట్లో పనిచేసే పనిమనిషిపై అత్యాచార ఘటన జరిగింది. అదే ఇంట్లో వంట పనిచేసే శివ అనే వ్యక్తి సదరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. బాధితురాలు తన సోదరుడికి విషయం చెప్పడంతో పోలీస్ స్టేషన్ల్ లో ఫిర్యాదు చేశారు.