దేశంలో సురక్షితమైన, చవకైనా ప్రయాణంగా రాపిడో బైక్ టాక్సీ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. రోజువారీ ప్రయాణికులకు భద్రత కల్పిస్తున్నది. 40 నగరాల్లో 2 మిలియన్లకు పైగా కస్టమర్లు. 10 మిలియన్ల రైడ్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు మహిళా కెప్టెన్‌లతో సహా 15,000 నుంచి 20,000 కెప్టెన్లు ఉన్నారు. హైదరాబాద్ రాపిడో మొదటి ఫీమేల్ కెప్టెన్‌గా గాయత్రి నలిచింది.
సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం. రెండు నెలల్లో ట్రైనింగ్ ముగిసింది. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. దానిపై పెద్దగా అవగాహన లేదు. కోర్స్‌లో చేరింది. హాస్టల్ మధ్యలో.. ఒకవైపు ఆఫీస్, మరోవైపు ఇనిస్టిట్యూట్. ఉదయం లేవగానే ఇనిస్టిట్యూట్‌కు వెళ్లాలి. తర్వాత హాస్టల్‌కు వచ్చి రెడీ అయి మరలా ఆఫీసుకు వెళ్లాలి. ఉదయాన్నే రెడీ అయి లంచ్‌బాక్స్ తీసుకెళ్దామంటే భోజనం తయారుచేయరు. సొంత వాహనం లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే బస్సుల ప్రయాణం తప్ప మరేం కనిపించదు. ఇదంతా ఎందుకని సొంతంగా స్కూటీ తీసుకుంటే. రోజులో మూడుసాైర్లెనా అదే ఏరియాలో తిరగాల్సిందే.. ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడిగితే బాగోదు. ఇలా అనుకుంటున్న సమయంలో రాపిడో వెలుగులోకి వచ్చింది. ఇనిస్టిట్యూట్ ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు అటువైపు వెళ్లే పాసింజర్లను ఎక్కించుకొని డ్రాప్ చేస్తుంది. సమయంతోపాటు ఆదాయం వస్తుంది.
డబ్బులు అవసరం లేదు. ఒంటరిగా దూరం ప్రయాణించాలి. పక్కన ఎవరైనా ఉంటే మాట్లాడుకుంటూ వెళ్లొచ్చు. బైక్ ఆపి ఎక్కండి నేను డ్రాప్ చేస్తానంటే ఎవరైనా ఊరుకుంటారా? చెంప చెళ్లుమనిపించరు. అప్పుడూ రాపిడో గురించి తెలిసింది. రాపిడోలో కెప్టెన్‌గా చేరారు. ఎక్కడికి వెళ్తున్నా ఆ రూట్ అప్‌డేట్ అవుతుంది. ఆ రూట్‌లో ఎవరైనా బుకింగ్ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయొచ్చు. దీంతో ఒంటరి ప్రయాణం సరదా ప్రయాణంగా మారుతుంది.
ఈ విధంగా ర్యాపిడో ఎంతోమందికి సమయాన్ని ఆదాచేయడంతో పాటు ఉపాధిని కల్పిస్తున్నది. రాపిడోలో మహిళలు కూడా ఉన్నారు. హైదరాబాద్‌లో మొదటి రాపిడో ఫీమేల్ కెప్టెన్‌గా గాయాత్రి పేరుపొందింది. ఆమె ఎప్పుడూ చౌకైన రావాణా మార్గాలకోసం చూస్తుంటుంది. ఇందుకు బైక్‌టాక్సీ ఉపయోగకరంగా ఉంటుందనుకున్నది. రాపిడో గురించి తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నది. అందులో చేరింది. ఇప్పుడీమె ఎంతోమంది మహిళలకు ఉదాహరణగా మారింది. అమ్మాయి రాపిడో కెప్టెన్‌గా చేరడం తప్పేమి కాదు. సమాజంలో అవగాహన తీసుకురావాలి. రాపిడ ఎంప్లాయ్‌గా ఉన్నందుకు గర్వపడుతుంది.
రాపిడో బుక్ చేసుకన్నవారు అసభ్యంగా ప్రవర్తిస్తే ఏం చేస్తావ్ అని చాలామంది భయపెట్టేవారు. కానీ ఇప్పటివరకు ఏ కస్టమర్ ఆమెను ఇబ్బంది పెట్టలేదంటున్నది. వారిని సమయానికి గమ్మాన్ని చేర్చినందుకు వారే కృతజ్ఞతలు తెలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటున్నది. గాయత్రి డబ్బుకోసం రాపిడోలో చేరలేదు. చాలామందికి స్ఫూర్తినిచ్చేలా, సొంతంగా సంపాదించాలనుకునే మహిళలు ఆదర్శంగా ఉండాలనుకున్నది. రాపిడో కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానిఇ గాయత్రి ఎల్లప్పుడూ ఉంటానంటున్నది. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఈ వేదికలోనే కొనసాగుతానంటున్నది.
– గాయత్రి, డిజైనర్
బుకింగ్ ఎలా?
రాపిడో బైక్-టాక్సీని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది కేవలం బైక్‌కు మాత్రమే. ఆటో ఆప్షన్ ఉండదు. ఫోన్‌నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఓటీపీ రాకుండానే ట్రూకాలర్‌తో వెరిఫై చేస్తుంది. తర్వాత మీ లోకేషన్‌ను జీపీఎస్ ద్వారా తీసుకుంటుంది. డ్రాపింగ్ లోకేషన్ ఎంటర్ చేస్తే అందుబాటులో ఉన్న బైక్స్ చూపిస్తుంది. బుక్ చేసేముందు కూపన్‌కోడ్ కూడా ఉపయోగించుకోవచ్చు. రాపిడో కెప్టెన్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బాషల్లో తెలిసినవారే ఉంటారు. తెలియని వ్యక్తితో వెళ్లడానికి భయపడతుంటే.. రైడ్ లింక్‌ను వాట్సప్, మెయిల్స్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. అందుకు నాలుగు కాంటాక్ట్‌లను సేవ్ చేసుకుంటే వెంటనే పంపించవచ్చు. ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఎమర్జెన్సీ బటన్ నొక్కితే అంబులెన్స్ సర్వీసులకు సమాచారం అందుతుంది. రైడ్ పూర్తయ్యాక క్యాష్, గూగుల్‌పే, పేటీయమ్ ఎలా అయినా పే చెయొచ్చు. అంతేకాదు డిస్కౌంట్ కూడా ఉంటుంది. సర్వీస్ నచ్చితే కెప్టెన్‌కు టిప్ కూడా యాడ్ చెయడానికి వీలుంటుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. కెప్టెన్ మాత్రమే కాదు వెనుక కూర్చున్న కస్టమర్లకు కూడా రాపిడో హెల్మెట్‌ను అందిస్తుంది. రైడ్ అనంతరం తిరిగి తీసుకుంటుంది. దీంతోపాటు ఇన్సురెన్స్ కూడా అందిస్తున్నది.
కెప్టెన్ అవ్వండి
ఈరోజుల్లో ఎన్నో క్యాబ్ సర్వీసులు, ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక చాలామంది వాటిలో పార్ట్‌టైంగా, మరికొంతమంది ఫుల్‌టైం ఎంప్లాయ్స్‌గా మారుతున్నారు. అలాగే రాపిడోలో కెప్టెన్‌గా చేర్చుకునేముందు బ్యాక్‌గ్రౌండ్ చెక్‌చేసి కెప్టెన్స్‌కు శిక్షణ ఇస్తారు. కాలం, సమయంతో పనిలేకుండా సర్వీస్ టైంలో కెప్టెన్‌కు రాపిడో కెప్టెన్ వెల్‌ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తుంది. అక్కడ రూ. 1కే కొబ్బరినీళ్లు, వివిధ ప్రదేశాలలో బ్రేక్‌ఫాస్ట్. ఐదు లక్షల వరకు వందశాతం ఇన్సురెన్స్ ఇస్తుంది. రాపిడో కెప్టెన్‌గా చేరాలనుకుంటే రాపిడో కెప్టెన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉండే బైక్ 2007 ఏడాది కన్నాముందుగా తయారుచేసింది కాకూడదు. ఎందుకుంటే కస్టమర్లకు అనుకూలంగా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లు అవసరం. రాపిడోను సంప్రదించి కెప్టెన్ చేరండి.