ఆర్టీఏ కీల‌క‌ నిర్ణయం.. హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్సు రద్దు..

-

సినీనటుడు రాజశేఖర్ కారు జాతీయరహదారిపై ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే కారు మూడు పల్టీలు కొట్టిన సంగతీ తెలిసిందే. ప్రమాదంలో రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేసిన పోలీసుల‌కు ఆయ‌న 21 సార్లు తన కారులో అతి వేగంతో ప్ర‌యాణించిన‌ట్లు సీసీ కెమెరాల స‌హాయంతో గుర్తించారు.

దీని కార‌ణంగా రాజ‌శేఖ‌ర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ర‌ద్దు చేయాల‌ని సైబ‌రాబాద్ డీసీపీ విజ‌య్‌కుమార్ సిఫార్స్ చేశార‌ట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న లైసెన్స్ ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్నాయి. ఇక ఇప్పటికే హీరో రాజశేఖర్ ట్రాఫిక్ నిబంధలను పలు మార్లు ఉల్లఘించిన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంతో రాజశేఖర్ 2017 అక్టోబర్ 9న కారు ప్రమాదానికి గురైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version