అదరగొడుతున్న అందాల ‘రాశి’

-

హీరోయిన్ రాశిఖన్నాకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారును నిద్రపోకుండా చేస్తుంది. ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ.. ఆ తర్వాత తన నటన, గ్లామర్ తో ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తనదైన నటన, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఏకంగా లవకుశలో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తనతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది హీరోయిన్లు.. అవకాశాల్లేక ఇబ్బందులు పడుతుంటే.. రాశిఖన్నా మాత్రం.. తెలుగు, తమిళం, మళయాల సినిమాలతో దూసుకుపోతోంది.

అప్పట్లో సాయిధరమ్ తేజ్ తో సినిమాలు చేస్తున్నప్పుడు అతనితో లవ్ ట్రాక్ నడుపుతోందని రూమర్స్ కూడా వచ్చాయి. అయితే వీటిపై వీరిద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పంజాబీ అమ్మాయి అయిన రాశి తనకు మాత్రం తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం అని ఎన్నో సార్లు చెప్పింది. అప్పట్లో బొద్దుగా తయారైన ఈ ముద్దుగుమ్మ.. తీవ్రంగా జిమ్ లో కష్టపడి మళ్లీ అందంగా తయారైంది. ఇప్పుడు తన అందాలతో ఫొటోషూట్ లు చేస్తూ.. యూత్ మతిపోగొడుతోంది.

తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. పలుచని దుస్తుల్లో బంగారు రంగులో ఉన్న డ్రెస్సులో మెరిసిపోతోంది. ప్యాంట్, జాకెట్ లెగిన్స్ ఒకే కలర్ లో ఉండే విధంగా మ్యాచింగ్ వేసుకుని అందాలతో అదరగొడుతోంది. ఈమె షేర్ చేసిన ఫొటోలు నిముషాల్లోనే వైరల్ గా మారాయి. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version