ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన రాసి కన్నా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ఇటీవలే వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతుంది ఈ అమ్మడు. విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ అనే సినిమాలో తన బోల్డ్ పాత్రతో రాశి ఖన్నా అందరిని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. అంతేకాకుండా వెంకీ మామ, ప్రతి రోజు పండగే సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గత కొన్ని రోజుల నుంచి డిఫరెంట్ పాత్రల కోసం వెతుకులాట ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ.
డిఫరెంట్ లుక్స్ తో ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హాజరైన రాశి ఖన్నా తన పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని ఇప్పటివరకు ప్రేమ జోలికి పోలేదు అంటూ చెప్పుకొచ్చింది. తన జీవితంలోకి స్పెషల్ పర్సన్ వస్తే అతనితో డేటింగ్ వెళ్లేందుకు సిద్ధం అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ వ్యక్తి కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది రాశి ఖన్నా .