వరద సాయం అందని వారు ఇలా చేయండి : కేటీఆర్

-

ఈ ఏడాది అసాధారణ రీతిలో వర్షాలు పడ్డాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. అసాధారణ వర్షాలకు అసాధారణ రితీలో సాయం చేశామని అన్నారు. 4 లక్షల 75 వేల 871 కుటుంబాలకు 10 వేల ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఎన్నడూ లేని విధంగా దసరా ముందురోజు లక్ష కుటుంబాలకు సాయం అందించినట్లు చెప్పారు. ఇక వరద సాయం అందిన వారి కోసం కొత్త పద్ధతిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

మీ సేవా కేంద్రాల్లో కొత్త అప్లికేషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్‌. సా యం అందనివారు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్‌ను అధికారులు పరిశీలించాక బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు జమ చేస్తారని తెలిపారు మంత్రి కేటీఆర్‌. మరో పక్క పారిశుద్ధ్య కార్మికులకు దీపావళి కానుక అందించింది ప్రభుత్వం. వారి జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్‌. పారిశుద్ధ్య కార్మికులకు మరో 3 వేల రూపాయలు పెంచినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో జీహెచ్‌ఎంసీ వర్కర్ల జీతం 14 వేల 500 నుంచి 17 వేల 500 రూపాయలకు పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version