టీవీ ఛానెళ్ళ సత్తా తెలిపే కొలమానం టీఆర్పీ. టీవీ ఛానెళ్లు టీఆర్పీల కోసం పనిచేస్తుంటాయి.. రష్మీ, సుధీర్ల మద్య ఎఫైర్ కూడా టీఆర్పీ కోసమే క్రియేట్ చేసిందనేది ముందునుంచి ఉన్న అనుమానం. ఇక జబర్దస్త్ కామెడీ షో చూసి బాగా నవ్వుకునేవాళ్లు మొన్నటి వరకు.. కానీ ఇప్పుడు ఆ షోలో జరిగే విషయాలు తెలిసి అసహ్యించుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు సగటు ప్రేక్షకులు. తొమ్మిది సంవత్సరాల నుండి నిరాటంకంగా నడుస్తుండటం మామూలు విషయం కాదు. ఎందరో కమెడియన్స్‌ని అందించిందీ షో..
చిల్లిగవ్వలేకుండా కష్టాలు పడుతున్నవారికి ఉపాధిని చూపించింది. ఈ షో లేకపోతే వారందరూ జీరోలే?? అంతలా లైఫ్ ఇచ్చింది. ఇదంతా మల్లెమాల అండ్ కో మాట.. ఒకప్పుడు ఈ షో తమకు అమ్మలాంటిదంటూ చెప్పుకొచ్చారు మాజీలు. అందులోను నిజం ఉంది.. కానీ.. ఊరికే కేవలం అందరికీ లైఫ్ ఇవ్వాలనే అవకాశాలు ఇచ్చారా?? ట్యాలెంటు లేకపోతే ఇచ్చేవారా?? ఇదీ విశ్లేషకుల ప్రశ్న. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ ది అవసరం, కమెడియన్స్‌ది అవకాశం.. అంతే..
జబర్దస్త్ వల్ల కమెడియన్స్‌కి, వారి వల్ల జబర్దస్త్ కి అంతకంటే వందరెట్లు లాభాలు వచ్చాయి. సంవత్సరాలపాటు టీఆర్పీ రేటింగ్స్‌లో టాప్‌లో నిలిచింది ఈ షో వల్లే. యూట్యూబ్‌లో మిలియన్స్ వ్యూస్‌తో పాటు మిలియన్స్ సంపాదించారు.
మొన్నటి వరకు అంతా బాగున్నా సీనియర్ కమెడియన్స్ సుధీర్, గెటప్ శ్రీను షోనుండి భయటకు వచ్చినతరువాత రచ్చ రచ్చగా తయారయ్యింది జబర్దస్త్ పరిస్థితి. జబర్ధస్త్ పై కిర్రాక్ ఆర్పీ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించింది. ఆర్పీ వ్యాఖ్యలపై జబర్దస్త్ లో కొనసాగుతున్న కమెడియన్స్ కౌంటర్ ఇచ్చారు. ఇదే క్రమంలో ఆర్పీ మాట్లాడుతూ అసలు ఎవరి వల్ల ఎవరికి లాభం జరిగింది. వారిది అవసరం, మాది అవకాశం.. మంచి అవకాశం దొరికితే ప్రూవ్ చేసుకోవచ్చనే ఆలోచన మాది. జబర్దస్త్ మాకు లైఫ్ ఇవ్వడం కాదు, మేమే జబర్దస్త్‌కి లైఫ్ ఇచ్చాం అంటూ చెప్పుకొచ్చాడు.
కేవలం షో, రేటింగ్ కోసం సుధీర్, రష్మీల మద్య ఎఫైర్ ఉన్నట్లు కావాలని క్రియేట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేవలం రేటింగ్ కోసమే వారిద్దరి మద్య ఎఫైర్ క్రియేట్ చేశారని చెప్పాడు. మనుషుల మీద గౌరవం ఉండదు, అంతలా అవమానాలు అయ్యాయి కాబట్టే సుధీర్ బయటకు వచ్చాడంటూ చెప్పుకొచ్చాడు. సుధీర్‌ని మ్యాజిక్‌లు చేసుకునేవాడు అనేవారు.. అది తెలిసి బాధ అనిపించింది, ఇప్పుడు నేను బయటకు వస్తున్నా తరువాత చాలామంది బయటకు వచ్చేస్తారని అప్పుడే అనుకున్నానంటూ వివరించాడు.