ట్విట్టర్‌ వేదికగా.. ప్ర‌ధాని మోదీపై కేటీఆర్‌ ప్రశ్నాస్త్రాలు

-

మరోసారి ట్విట్టర్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశ్నాస్త్రాలు సంధించారు మంత్రి కేటీఆర్‌. రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ నిధుల అంశంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ చెబుతున్న స‌బ్ కా సాథ్.. స‌బ్ కా వికాస్, స‌మాఖ్య స్ఫూర్తి ఇదేనా? అని ప్ర‌శ్నించారు. భారీ వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ.. 2018 నుంచి ఎన్డీఆర్ఎఫ్ ద్వారా ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేదు. 2020లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు.. వ‌ర‌ద సాయం కోసం ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వ‌లేదు.

ఇప్పుడు గోదావ‌రి వ‌ర‌ద‌ల‌కూ కేంద్రం సాయం చేయ‌ట్లేదు.. ఎందుకు? అని ప్ర‌శ్నించారు మంత్రి కేటీఆర్. ఇదిలా ఉంటే.. గత వారం తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు వాగుల వంకలు పొంగాయి. అంతేకాకుండా వరద నీరు వచ్చి పలు గ్రామాలు మంపుకు గురయ్యాయి. అయితే ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్‌ వరద బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో పాటు.. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామన్నారు సీఎం కేసీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version