కేర‌ళ వాసుల‌కు మ‌రో కొత్త క‌ష్టం.. ర్యాట్ ఫీవ‌ర్ తో ప్ర‌జ‌ల బెంబేలు..!

-

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేర‌ళ ప్ర‌జ‌లు వ‌ర్షాల‌కు, వ‌ర‌ద‌ల‌కు భ‌య‌ప‌డ్డారు. కానీ ఇప్పుడా బాధ లేదు. కాక‌పోతే మ‌రో కొత్త క‌ష్టం వారిని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. కేర‌ళ ప్ర‌జ‌లు ఇప్పుడు ఎలుక‌ల‌ను చూసి భ‌య‌ప‌డుతున్నారు. అవి ఎక్క‌డ త‌మ ప్రాణాల‌ను తీస్తాయోన‌ని జంకుతున్నారు. చిన్న‌పాటి అనారోగ్యం క‌లిగినా, దాని తాలూకు ల‌క్ష‌ణాలు కనిపించినా హాస్పిట‌ల్స్‌కు ప‌రుగులు తీస్తున్నారు.

ఎలుక‌లు ఇప్పుడు కేర‌ళ రాష్ట్ర వాసుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే.. బ్యాక్టీరియల్ ఫీవర్ లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి ఎలుక‌ల నుంచి ప్ర‌జ‌ల‌కు వ్యాపిస్తున్న‌ద‌ట‌. దీన్నే ర్యాట్ ఫీవ‌ర్ అని కూడా పిలుస్తున్నారు. దీని కార‌ణంగా కేవ‌లం ఈ కొన్ని రోజుల వ్య‌వధిలోనే 10 మంది వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయార‌ట‌. ఇవి అధికారిక లెక్క‌లు. కానీ అన‌ధికారికంగా ఇంకా ఎక్కువ మందే ర్యాట్ ఫీవ‌ర్ వ‌ల్ల చ‌నిపోయి ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు.

కేర‌ళ‌లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ర్యాట్ ఫీవ‌ర్ వేగంగా వ్యాపిస్తున్న‌ద‌ట‌. ఈ వ్యాధి ఇంకా 302 మందికి సోకిన‌ట్టు గుర్తించారు. జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న 719 మందిని అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచారు. ఇక కేవ‌లం ఒక్క కోజికోడ్‌లోనే 28 వ‌ర‌కు ర్యాట్ ఫీవ‌ర్ కేసులు న‌మోదు అయిన‌ట్టు తేల్చారు. అలప్పుజా, త్రిస్సుర్, పతానంతిట్ట ప్రాంతాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. స్ట్రెప్టోబాసిల్లస్ మొనిలిఫార్మిస్ బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా ద్వారా లెప్టోస్పైరోసిస్ వస్తుంది. ఇది ఎలుకల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఎలుక మల మూత్రాలు ఆహారపదార్థాల్లో కలిసినప్పుడు.. వాటి ద్వారా మనుషులకు ఇది వ్యాపిస్తుంది. అలాగే.. మనిషిని ఎలుక కరిచినా స్ట్రెప్టోబాసిల్లస్ మొనిలిఫార్మిస్ బ్యాక్టీరియా మనిషిలోకి ప్రవేశిస్తుంది. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయి. సకాలంలో గుర్తించి ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version