స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడానికి గానూ ముందుకు వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సరికొత్త వ్యాపార వేత్తను బయటి ప్రపంచానికి పరిచయం చేసారు. ముంబైలోని యంగ్ ఆంత్రప్రెన్యూర్ అర్జున్ దేశ్‌పాండే వయసు 18 ఏళ్ళు. అతను జనెరిక్ ఆధార్ ఫార్మసీ-అగ్రిగేటర్ స్థాపించి విజయవంతంగా రన్ చేస్తున్నాడు.
జనరిక్ మందులను తయారు చేసిన వారి నుంచి చిల్లర వ్యాపారులకు మందులు ఇస్తుంది. మార్కెట్ ధర కంటే 20-30 శాతం తక్కువకే మందులను విక్రయిస్తు౦డటం రతన్ టాటాకు బాగా నచ్చేసింది. ఈ సంస్థలో 55 మంది పని చేస్తున్నారు. అర్జున్ 2018లో రూ. 15 లక్షల ప్రారంభ నిధులతో ఈ స్టార్టప్‌ను మొదలుపెట్టగా… ముంబైలో 35 ఫ్రాంచైజీలున్నాయి.
ఇతర మెట్రో నగరాలకు విస్తరించాలని రాబోయే రోజుల్లో వెయ్యి శాఖలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, గోవా, రాజస్థాన్, గుజరాత్, తెలంగాణా రాష్ట్రాలకు విస్తరించే ఆలోచనలో ఉండగా జనరిక్ ఆధార్‌లో 50 శాతం వాటాను రతన్ టాటా తాజాగా కొనుగోలు చేశారు. అయితే ఈ వివరాలను ఆయన అధికారికంగా ఇప్పటి వరకు వెల్లడించలేదు.