టీఆర్ఎస్ ప్రచార రథం మీద రావాలి జగన్ కావాలి జగన్ !

-

అదేంటి టీఆర్ఎస్ ప్రచార రథం మీద రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదం ఉండటం ఏమిటి అనుకుంటున్నారా. నిజమేనండీ టీఆర్ఎస్ ప్రచార రధం మీద ఆ నినాదం ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇదేమీ పెద్ద వింత ఏమి కాదు గతంలో కూడా టీఆర్ఎస్ కోసం వైఎస్సార్సీపీ చాలా సార్లు సహాయం చేసిన విషయం విదితమే. అలాగే వైసిపి కావలసినప్పుడు టీఆర్ఎస్ కూడా సహాయం చేసింది.

గతంలో కడప జిల్లాలో వైఎస్ఆర్ సీపీ పంచిన గోడ గడియారాలు పైన వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల ఫోటోలు ఉన్నా, ఆ ఫోటోలు చింపితే వెనుక టిఆర్ఎస్ సింబల్స్ కనిపించి కలకలం రేపాయి. ఇప్పుడు కూడా అలాంటిదే ఏదో జరిగి ఉండాలి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఎన్నికల హడావుడి లేదు. అక్కడ అ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ మీద ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో బహుశా ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ నేత కు సంబంధించిన ఏదైనా ప్రచార రథాన్ని ఇక్కడి నేతలు తెప్పించుకుని దానికి రంగు మార్చి ఈ ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటూ ఉండి ఉండాలి. ఇక ఈ ప్రచార రథం మీద ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఫోటో కూడా ఉండడంతో ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు ఎవరు ప్రచారం కోసం తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version