టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. గత ఏడాది ధమాకా సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవికి తమ్ముడు పాత్రలో నటించి.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఏప్రిల్ ఏడవ తేదీన రావణాసుర సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు. రవితేజ ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో సెరవేగంగా పాల్గొంటున్న ఈయన ఎన్నో విషయాలను మీడియాతో పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మహిళలపై షాకింగ్ కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారుతుంది.
తాజాగా చిత్ర బృందం సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్.. హీరో రవితేజను అలాగే రావణాసుర సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న హీరో సుశాంత్ ను ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలోనే రవితేజ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది.
రవితేజ మాట్లాడుతూ.. ఏదైనా మొహం మీదే చెప్పేసే ఆడవాళ్లు.. ముఖ్యంగా పొగరు కలిగిన ఆడవాళ్లు బాగా నచ్చుతారు. ఆడవాళ్లకు పొగరు ఉంటేనే బాగుంటుంది ఒకరిపై ఆధారపడకుండా.. ఎవరూ లేకపోయినా నేను ఉండగలను.. అనే ఆత్మస్థైర్యం కలిగిన వాళ్లు అంటే.. నాకు ఇష్టం అని తెలిపాడు. దీంతో రవితేజ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. మొత్తానికి అయితే రావణాసుర సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి దీంతో కచ్చితంగా సినిమా హిట్ కొడుతుంది అనే భావన కూడా ప్రేక్షకులలో బలంగా పాతుకుపోయింది అని చెప్పవచ్చు.