Ravichandran Ashwin: చరిత్ర సృష్టించిన అశ్విన్.. అనిల్ కుంబ్లే రికార్డులు బద్దలు

-

ఆసీస్ తో టెస్ట్ సందర్భంగా స్పిన్నర్ అశ్విన్ పలు రికార్డులు సృష్టించాడు. తాజా మ్యాచ్ లో 6 వికెట్లు తీసిన అశ్విన్, భారత్ లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. అతడు 26 సార్లు 5 వికెట్లు తీశాడు. ఇక టెస్టుల్లో ఆసీస్ పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.

మరోవైపు BGT లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లియోన్ రికార్డును కూడా అశ్విన్ సమం చేశాడు. ఇక అటు ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్లో 300 క్యాచ్లు అందుకున్న రెండో భారత క్రికెటర్ గా కోహ్లీ ఘనత అందుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాటర్ నాథన్ లియాన్ క్యాష్ అందుకొని ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 334 క్యాచ్ లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version