రూ. 2000 నోట్ల రద్దుపై… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన కారణాలు ఏమిటి..?

-

రూ. 2000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చాలా మందిలో సందేహాలు వున్నాయి. ఇక మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం అంటోంది..? అసలు ఏం జరిగింది అనే విషయాలని ఇప్పుడే తెలుసుకుందాం. సామాన్య ప్రజల్లో అనేక సందేహాలు రూ. 2000 నోట్లను రద్దు చేయడం పైన వున్నాయి. గతంలో చేసినట్టే ఇప్పుడు కూడా అలా చేస్తున్నారు.

ఎవరి దగ్గరైన వున్నా రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ పలు పరిమితులతో కూడిన అనుమతి ఇచ్చింది. రూ.2,000 నోటును సాధారణంగా లావాదేవీలకు ఉపయోగించరని.. ఇతర డినామినేషన్ల లోని నోట్ల నిల్వలు ని ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోతాయని ఆర్బీఐ అంది. రూ. 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లలో దాదాపు 89% మార్చి 2017కి ముందు జారీ చెయ్యబడ్డాయని అయితే వాటి అంచనా జీవిత కాలం 4-5 సంవత్సరాల ముగింపులో ఉన్నాయని అంది.

మార్చి 31, 2018 నాటికి గరిష్టంగా ఉన్న రూ. 6.73 లక్షల కోట్ల నుండి చెలామణిలో నోట్లు వున్నా వాటి విలువ రూ. 3.62 లక్షల కోట్లకు తగ్గిందని అంది. 31, 2023న చెలామణి లో ఉన్న నోట్లలో కేవలం 10.8% మాత్రమే ఉన్నాయని ఆర్బీఐ అంది. “క్లీన్ నోట్ పాలసీ” ప్రకారం రూ. 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లని చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించబడింది.

రూ. 2000 డినామినేషన్‌లోని బ్యాంకు నోట్లు చట్టబద్ధమైన టెండర్ గా కొనసాగుతాయి అని అంది. రూ.2000 నోట్లను ప్రవేశపెట్టాలనే లక్ష్యం నెరవేరిందని సెంట్రల్ బ్యాంక్ అంది. 2018-19లో రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు చెప్పారు. రూ. 2000 నోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయవచ్చని.. బ్యాంకులో ఆ నోట్లని ఇతర విలువల నోట్ల లోకి మార్చుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ అంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version