RC16: ఏఆర్ రెహమాన్ కెరీర్లోనే ఫస్ట్ టైమ్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ వచ్చే నెలలోగా పూర్తిచేసేలా డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేశారట.ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్ర ఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే… ఈ చిత్రం పూర్తికాగానే డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న ‘RC16’ షూటింగ్లో రామ్ చరణ్ పాల్గొననున్నారు.ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.RC 16 మూవీకి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్,సంగీతాన్ని అందించబోతున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్లోనే సాంగ్స్ చిత్రీకరణ పూర్తిచేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, మ్యూ జిక్ డైరెక్టర్ AR రెహమాన్ కెరీర్లో రెగ్యులర్ షూట్ ప్రారంభంకాకముందే మూడు సాంగ్స్ రికార్డ్ చేయడం ఇదే మొదటిసారి.ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రాన్ని సుకుమార్‌-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version