ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో 2025-26 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ కేటాయింపులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చదివి వినిపించారు. అనంతరం కాసేపు బడ్జెట్ మీద చర్చ జరిగింది.
ఈ క్రమంలోనే సభను 3వ తేదీకి స్పీకర్ అయ్యన్న పాత్రుడు వాయిదా వేశారు. ‘బడ్జెట్ మీద సభ్యులందరికీ పూర్తిగా అవగహన రావాలి. రేపు, ఎల్లుండి సెలవు ఇస్తున్నాం కాబట్టి అందరూ బడ్జెట్‌ను పూర్తిగా చదివి అర్ధం చేసుకోవాలి. బడ్జెట్ మీద మాట్లాడటానికి అసెంబ్లీలో 3 రోజులు సమయం ఇస్తున్నాం. అందరూ బాగా చదివి బడ్జెట్‌ను అర్ధం చేసుకోండి’ అని స్పీకర్ వెల్లడించారు.