పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నియోజకవర్గం గోదావరిఖనిలోని నిండుగా ఉండే గోదావరి ఒక్కసారిగా కళ తప్పింది. వేసవి రాకముందే గోదావరిలోని నీరంతా మాయమైంది. ఎక్కడా చూసిన మురుగు నీరు తప్పా గలగల పారే గోదావరి ఛాయలు కనిపించడం లేదు.
గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంపుల ద్వారా నీళ్లు ఎత్తిపోయడం ద్వారా 365 రోజులు అనునిత్యం గోదావరి నిండుగా కనిపించేందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎల్లపల్లి నుంచి నీటిని కిందకు విడుదల చేయడం లేదు. దీంతో గోదావరి మొత్తం ఇసుక మేటలే కనిపిస్తున్నాయి. ఇక శివరాత్రి రోజు భక్తులకు మురికి నీళ్లే దిక్కైనాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకపోవడంతో ఇసుకను స్థానిక కాంగ్రెస్ లీడర్లు అక్రమంగా దోచేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
https://twitter.com/HarishBRSUSA/status/1895332541898367119