కొన్ని సంఘటనలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. కానీ అవి ఎదుర్కొన్న వాళ్లకు మాత్రం బాధనే మిగుల్చుతాయి. కరెంట్ కోత వల్ల పెళ్లిళ్లు తారుమారు అయ్యాయి. అక్క చేసుకోవాల్సిన మెగుడ్ని చెల్లి చేసుకుంది.. చెల్లి చేసుకోవాల్సిన అబ్బాయిని అక్క చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఉన్నాయి.
ఇద్దరు అమ్మాయిలు (అక్క, చెల్లి) పెళ్లికి రెడీ అయ్యారు. ఇద్దరూ ఒకే రకమైన పెళ్లి డ్రెస్ వేసుకున్నారు. ఇక పెళ్లి అంటే.. చుట్టాలు, స్నేహితులు, తినేవాళ్లు, వచ్చేవాళ్లు.. అబ్బో మాములు హడావిడి కాదు..ఇంతలో కరెంట్ పోయింది. అలాగని ఆగితే ఎలా? ముహూర్తానికి పెళ్లి జరగకపోతే మంచిది కాదంటారు కదా… ఒకేసారి రెండు పెళ్లిళ్లూ జరిగాయి. ఆ తర్వాత చూస్తే… పెళ్లి కొడుకులు మారిపోయారు. అక్క చేసుకోవాల్సిన అబ్బాయిని… చెల్లి చేసుకుంది. చెల్లి చేసుకోవాల్సిన అబ్బాయిని అక్క చేసుకుంది? ఈ తప్పు ఎవరిది? దీనికి ఎవర్ని నిందించాలి?
రమేష్ లాల్ కూతుర్లైన నికిత, కరిష్మా పెళ్లిళ్లు ఇలా జరిగాయి. ముందుగా అనుకున్నదాని ప్రకారం… నికిత… దంగ్వారా భోలాని పెళ్లి చేసుకోవాలి. కరిష్మా… గణేష్‌ని చేసుకోవాలి. కానీ.. నికిత… గణేష్‌ని చేసుకుంది. కరిష్మా… దంగ్వారా భోలాని చేసుకుంది. ఉజ్జయినీకి 20 కిలోమీటర్ల దూరంలోని బద్నాగర్ తహసిల్‌లోని అస్లానా గ్రామంలో ఇది జరిగింది.ఇంకా హైలెట్ ఏంటంటే.. పెళ్లిలో జరిగిన ఈ గందరగోళం విషయం వెంటనే తెలియలేదు. చాలాసేపటికి ఇద్దరు వరుళ్లూ… తాము పెళ్లి చేసుకున్న అమ్మాయిలను తమ తమ ఇళ్లకు తీసుకెళ్లారు. అక్కడ ఈ విషయం తెలిసింది. అందరికీ దిమ్మతిరిగింది.
అంతా అయ్యాక.. మళ్లీ రెండు కుటుంబాల వాళ్లూ పంచాయితీకి వచ్చారు. ఒకర్ని ఒకరు తిట్టుకున్నారు. “మీరు… చూసుకోవద్దా… అంటే మీరు చూసుకోవద్దా…” అని అనుకున్నారు. సరే… ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించి… మళ్లీ మర్నాడు… అసలు పెళ్లిళ్లు జరిపించారు. ఈసారి… పద్ధతి ప్రకారంకరెక్టుగా పెళ్లిళ్లు జరిగాయి.
ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నెటిజన్లు తమకు నచ్చినట్లు కమెంట్లు చెసేస్తున్నారు. కొందరు నవ్వుతుంటే.. మరికొందరు.. వేదమంత్రాలకు విలువలేకుండా పోయిందని అంటున్నారు. ఇంతకీ మీరేమంటారు.?
Real Life Shiza-Fizza scene in India.
Two sisters were getting married in Madhya Pradesh’s Ujjain and things got mixed up a little due to a power failure. In the dark, the brides performed the wedding ceremony with the wrong groom.#امپورٹڈ__حکومت__نامنظور #AbhiRaKiShaadi pic.twitter.com/QcASR3itN2— Graduate Talks (@graduatetalkspk) May 9, 2022
-Triveni Buskarowthu