రియ‌ల్ స్టోరీ ఆఫ్ బాహుబ‌లి.. ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు..!

-

వాస్త‌వానికి గూగుల్ లోకి వెళ్ళి బాహుబలి అని సెర్చ్ చేయండి. వస్తే గిస్తే ప్రభాస్ గురించో, రాజమౌళి గురించో లేక రానా గురించో, అంతకు మించితే ట్రైలర్ల హడావుడి గురించో కనబడుతోంది. కానీ సహనానికి ఐకాన్ లాంటి బాహుబలి మన గడ్డపై నిజంగా నివసించిన అసలు సిసలు బాహుబలి గురించి ఎక్కడా కనబడదు,వినబడదు. అవును బాహుబలి సహనానికి కేరాఫ్ అడ్రస్ లాంటి వాడు, యుద్దాన్ని వద్దన్న శాంతిదూత, రాజ్యాల కోసం తలలు నరుక్కుంటుంటే రాజ్యాన్నే గడ్డిపోచగా భావించిన వ్యక్తి అతను. సుఖాల కోసం, భోగాల కోసం పరితపిస్తుంటే రాజుగా ఉండి కూడా సాధు జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి అతను. కాస్త చరిత్రలోకి తొగి చూద్దాం.

ఋషబుని కుమారుడు బాహుబలి. ఇతనికే గోమఠేశ్వరుడనే పేరు.ఇతడికి ఇద్దరు భార్యలు. రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు.పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజధాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు. భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది. తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు. బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు.

స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు. భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి. అంతలోనే పునరాలోచనలో పడతాడు. బాహుబలి ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి, రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సుచేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు.


బాహుబలి విగ్రహం కర్నాటక లోని శ్రావణ బెళగొళ లో ఉంది. 58 అడుగులున్న ఈ విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీ.శ.983వ సంవత్సరంలో ఇంద్రగిరి పర్వతంపై ఈ విగ్రహాన్ని చెక్కించినట్లు స‌మాచారం. అయితే బాహుబలి విగ్రహాన్ని బాహుబలి అన్న భరతుడే నిలిపాడని జైనులంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version