లాంచ్‌ అయిన Realme GT Neo 3 Thor Edition..దద్దరిల్లిపోతున్న ధర..!

-

రియల్‌మీ జీటీ నియో 3 స్మార్ట్ ఫోన్ స్పెషల్ ఎడిషన్ ఇండియాలో లాంచ్‌ అయింది. దీనికి సంబంధించిన థోర్: లవ్ అండ్ థండర్ లిమిటెడ్ ఎడిషన్‌ను రియల్‌మీ తీసుకువచ్చింది. థోర్: లవ్ అండ్ థండర్ సినిమా రిలీజ్ స్పెషల్‌గా ఈ ఫోన్ లాంచ్ అయినట్లు కంపెనీ తెలిపింది. ఎడిషన్‌ ధర ఇతర వివరాలు..
రియల్‌మీ జీటీ నియో 3 థోర్: లవ్ అండ్ థండర్ ఎడిషన్ ధర..
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులోకి తెచ్చారు..12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.42,999గా ఉంది.
నిట్రో బ్లూ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాం, రియల్‌మీ మెయిన్‌లైన్ వెబ్ సైట్లలో జులై 13నుంచి దీని సేల్ ప్రారంభం అయింది.

రియల్‌మీ జీటీ నియో 3 థోర్: లవ్ అండ్ థండర్ ఎడిషన్ స్పెసిఫికేషను..

ఈ స్మార్ట్ ఫోన్‌తో పాటు ప్రత్యేకమైన ప్రీమియం గిఫ్ట్ బాక్స్ లభించనుంది.
ఈ బాక్స్‌లో రియల్‌మీ జీటీ నియో 3 150W స్మార్ట్ ఫోన్‌తో పాటు థోర్: లవ్ అండ్ థండర్ థీమ్డ్ కార్డ్స్, వాల్ పేపర్, స్టిక్కర్లు, మెడల్స్, సిమ్ కార్డు ట్రేలు ఉండనున్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
టచ్ శాంప్లింగ్ రేట్ ఏకంగా 1000 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం.
సెల్ఫీ కెమెరా కోసం పంచ్ హోల్‌ను అందించారు.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై రియల్‌మీ జీటీ నియో 3 థోర్: లవ్ అండ్ థండర్ ఎడిషన్ పనిచేయనుంది.
12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.
5జీ, డ్యూయల్ 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 150W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో అందించారు.
ఈ ఫోన్ మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 188 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

దీని వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 స్కిన్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version