భద్రాద్రి : ఇల్లందు నియోజకవర్గంలో ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో ఇల్లందు, కోయగూడెం ఓసి గనులలో ఓబీ, బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం కలిగింది. కోయగూడెం ఓసి 2 గని లో భారీగా చేరింది వరద నీరు. వరద నీటిని గని నుండి తొలగించేందుకు భారీ మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు సింగరేణి అధికారు లు. అలా గే…50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది.
ఇక నియోజకవర్గంలో ప్రమాదవ స్థాయిలో పొంగిపొర్లుతున్న చెరువుల వద్ద ప్రహార కాస్తున్నారు పోలీసులు. వాగులు. చెరువు అలుగులు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు దారకూడదని హెచ్చరిస్తున్న అధికారులు…రెండో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. గుండాల, ఆలపల్లి మండలాల్లో పొంగి పొర్లు తున్నాయి కిన్నెరసాని ఏడుమెలికల మల్లన్న కోడిపుంజుల వాగులు. పలు ఏజెన్సీ గ్రామాలకు ఐదు రోజులుగా రాక పోకలు నిలిచి పోయాయి. నిత్యవసర సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు గ్రామీణ ప్రజలు.