ఓరినీ – విజయ్ దేవరకొండ ప్లాప్ లకి కారణం ఇదా ??

-

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా హీరో యాటిట్యూడ్ యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. అదే సమయంలో విజయ్ దేవరకొండ చేసిన సైలెంట్ క్యారెక్టర్ గీతా గోవిందం సినిమా కూడా సెన్సేషనల్ హిట్ అయింది. దీంతో ఇండస్ట్రీ లో తిరుగులేని హీరో అయిపోయాడు. ఇటువంటి సమయంలో వరుసబెట్టి సినిమాలో ఒప్పుకున్న విజయ్ దేవరకొండ కి వరుస పెట్టి అపజయాలు పలకరించాయి. దీంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ భయంకరంగా ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు.

ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్’ లవర్ సినిమా చేయడం జరిగింది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14వ తారీఖున భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే సినిమా హిట్ అవుతుందని భావించిన విజయ్ దేవరకొండ ఫాన్స్ కి సినిమాకి వచ్చిన మొదటి షో టాక్ తోనే పూర్తి నిరుత్సాహానికి గురిచేసింది. సినిమాలో విషయం లేకపోవటం డైరెక్షన్ చేత కాకపోవడంతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

 

అయితే గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ చేసిన సినిమాల ఫార్మేట్ మొత్తం చూస్తే…ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ అర్జున్ రెడ్డి సినిమాను తలపిస్తుంది. దీంతో తాజాగా విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ లో కూడా అర్జున్ రెడ్డి పోలికలు ఉన్నాయని సినిమా చూసిన వాళ్లు అంటున్నారు. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు విజయ్ దేవరకొండ ని రిసీవ్ చేసుకోలేకపోవడం జరిగిందని…డైరెక్టర్లు కూడా విజయ్ దేవరకొండ ని అర్జున్ రెడ్డి మాదిరిగానే ఊహించుకుని స్టోరీలు రాస్తున్నారని సినిమా ఫ్లాపుకి కారణం అదే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల టాక్. అర్జున్ రెడ్డి మానియా నుండి విజయ్ దేవరకొండ కోసం స్టోరీలు సిద్ధపరచే డైరెక్టర్ దృష్టి మారితే బాగుంటుందని…అప్పుడు విజయ్ దేవరకొండ హిట్ కొట్టడం గ్యారెంటీ అని నెటిజన్లు అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version