చిరాకు తెప్పిస్తున్న సుడిగాలి సుధీర్ !!

-

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ క్రేజ్ సంపాదించాడు సుడిగాలి సుదీర్. అనేక టీవీ షోలలో రాణిస్తూ మరోపక్క ఇటీవల సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఒకపక్క ఇండస్ట్రీలో క్యారెక్టర్ చేస్తూనే మరో పక్క హీరోగా కూడా ఇటీవల ఓ సినిమా చేశాడు. ముఖ్యంగా జనాలలో ఇండస్ట్రీలో ఇంత పాపులారిటీ రావటానికి గల కారణం యాంకర్ రేష్మి అని చెప్పవచ్చు. జబర్దస్త్ షో చేస్తున్న సమయంలో యాంకర్ రేష్మి తో సుడిగాలి సుధీర్ కి ఎఫైర్ ఉందని అలా గాసిప్స్ రావడంతో ఇద్దరి గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరూ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ సంపాదించారు.

ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉండటంతో చాలా వరకు టెలివిజన్ ప్రేమికులు ఇద్దరి జంట చేస్తున్న ప్రోగ్రాం లను బాగా అలరించారు. అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య అదే వాతావరణాన్ని క్యాష్ చేసుకుని టీవీ చానల్స్ చూపించడంతో తాజాగా ప్రేక్షకులు వీరిద్దరి జంట చూసి చిరాకు పడ్డారు. మేటర్ లోకి వెళితే ఇటీవల ప్రేమికుల రోజు సందర్భంగా షోలో భాగంగా ఓ సాంగ్ పెట్టి అందులో సుధీర్ రష్మికి ప్రపోజ్ చేస్తాడు. లవ్ సింబల్ బెలూన్ ఇచ్చి నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని భారీ డైలాగ్ కొట్టాడు సుధీర్.

 

అయితే ఇదివరకులా ఆడియెన్స్ ఇదంతా నిజమే అని నమ్మే సీన్ పోయింది. జస్ట్ షో కోసమే వారిద్దరు అలా లవర్స్ లా నటిస్తున్నారని అందరికీ తెలిసిపోయింది. దీంతో గతంలోలాగా ప్రేక్షకులు సుడిగాలి సుదీర్..యాంకర్ రేష్మి విషయంలో చేస్తున్న అతికి ఎవరు ఫిదా కావడంలేదని చిరాకు పడుతున్నారని అందుకే వాలెంటైన్స్ డే నాడు ఢీ షో లో సుధీర్ యాంకర్ రష్మీ చేసిన ప్రోగ్రాంకి పెద్దగా రేటింగ్ రాలేదన్న టాక్ టెలివిజన్ రంగంలో వినబడుతోంది. 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version