అలా చేయలేకే ఆ సినిమా నుంచి తప్పుకున్నా: రష్మిక మందన్నా

-

కన్నడ హీరో రిషభ్ శెట్టి నటించి ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార. ఈ సినిమా సెప్టెంబరు 30నే ప్రేక్షకుల ముందుకు రాగా.. తెలుగు వెర్షన్‌ను మాత్రం అక్టోబరు 14న విడుదల చేశారు మేకర్స్. అయితే విడుదలైనప్పటి నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోన్న ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని సృష్టిస్తోంది.

సినిమా బాగుంటే ఏ భాషా చిత్రమైనా తెలుగు ప్రేక్షకులు నిరాజనాలు పడతారు. అదే విధంగా హీరో ఎవరో తెలియనప్పటికీ కాంతార చిత్రానికి కాసుల వర్షం కురుస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే కేవలం తెలుగు వెర్షన్‌కే రూ.22.3 కోట్ల గ్రాస్ వచ్చాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మూవీ పేరు హాట్ టాపిక్​గా మారింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన అద్భుతంగా ఉంది అంటూ విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్​గా నటించింది సప్తమి గౌడ. కాగా ఈ సినిమాలో మొదట హీరోయిన్​గా అనుకున్నది మాత్రం రష్మిక మందన్నానట. అయితే ఈ స్టోరీ విన్న తర్వాత రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్​కి పెద్దగా స్కోప్ లేదు అంటూ చెప్పి సినిమా రిజెక్ట్ చేసిందట. అంతేకాదు పుష్ప సినిమాలో కూడా డీ గ్లామరస్ లుక్​లో నటించింది.. కాగా ఈ సినిమాలో కూడా డీ గ్లామరస్ లుక్​లోనే నటిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని ఆమె చెప్పి సినిమా నుంచి తప్పుకుందట.

అయితే అసలు రీజన్ మాత్రం వేరేగా ఉంది అంటున్నది కన్నడ మీడియా. నిజానికి ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడట. అంతేకాదు సప్తమి గౌడ ఈ సినిమా కోసం 50 లక్షల పారితోషకంగా తీసుకుందట. నిజానికి రష్మిక ప్రస్తుతం ఒక సినిమాకు నాలుగు కోట్ల పారితోషకం తీసుకుంటుంది. మరి అలాంటి రష్మికకు ఈ ఆఫర్ చేస్తే మహా అయితే రిషబ్ శెట్టి కోటి రూపాయలు ఇచ్చి ఉండేవాడు.

ఆ కారణంగానే రష్మిక ఆఫర్​ను వదులుకున్నట్లు తెలుస్తుంది. అయితే బయటకు మాత్రం సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువ అని.. డీ గ్లామరస్ రోల్ అని.. ఆ కారణంగా నటించలేదని చెప్తూ తప్పించుకుంటుంది ఈ అమ్మడు. రష్మిక ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో ఫుల్ బిజిగా గడుపుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version