ఎమ్మెల్యే రఘునందన్ రావుపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు?

-

దుబ్బాక బీజేపీలో అసమ్మతి స్వరం తెరమీదకు వచ్చింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలోని బిజెపి సీనియర్లు ఒక్కటై అసమతి స్వరం వినిపిస్తున్నారు. రఘునందన్ రావుకు వ్యతిరేకంగా మీరుదొడ్డిలో మరోసారి బిజెపి సీనియర్ నేతలు భేటీ అయినట్లు సమాచారం. ఈ సమావేశానికి తోగుట, దౌల్తాబాద్, దుబ్బాక, చేగుంట, మీరుదొడ్డి బిజెపి సీనియర్ నేతలు హాజరైనట్లుగా తెలుస్తోంది.

ఈ సమావేశంలో రఘునందన్ రావు పైనే ఎక్కువగా చర్చించారట. బిజెపిలో మొదటి నుంచి ఉన్న వారిని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనేది ఈ సమావేశంలో పాల్గొన్న వారి ఆరోపణ అట. ఎమ్మెల్యే అందరినీ కలుపుకొని ముందుకు సాగడం లేదని, తమకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చారట. త్వరలోనే వారి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ఈ భేటీలో నిర్ణయించారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version