రాష్ట్ర పునర్ నిర్మాణమే మా లక్ష్యం అని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. వైసీపీ సభ్యులకు సభను గౌరవించే సంస్కృతి లేదు. గత ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామనడం విడ్డూరం అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం మేము కూటమిగా ఏర్పడలేదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం అని తెలిపారు. గతంలో కౌరవ సభ.. ఇప్పుడు గౌరవ సభ అన్నారు సీఎం చంద్రబాబు.
చిత్తశుద్దితో పని చేస్తాం.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. 11 మంది వైసీపీ సభ్యులు.. సభలో కేవలం 11 నిమిషాలే ఉన్నారని తెలిపారు. అసెంబ్లీ అంటే దేవాలయంతో సమానం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామన్న వ్యక్తిని నా రాజకీయ జీవితంలో చూడటం ఇదే మొదటిసారి అని తెలిపారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే కూటమి అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.