ఇండియాలో కరోనా రికవరీ రేటు 77.09 శాతానికి మెరుగు పడింది అని కేంద్రం పేర్కొంది. దేశంలో గత 24 గంటల్లో 68,584 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు. రికవరీ రేటు ఇప్పుడు 77.09 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు, దేశంలో దాదాపు 3 మిలియన్ల మంది వైరల్ మహమ్మారి నుండి కోలుకున్నారని కేంద్రం పేర్కొంది. మొత్తం కేసులలో లో 21.16 శాతం మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని పేర్కొంది.
కోలుకున్న రోగుల సంఖ్య యాక్టివ్ కేసులను 3.6 రెట్లు అధిగమించింది. కోలుకున్న రోగుల సంఖ్య జూలై మొదటి వారం నుండి 2020 సెప్టెంబర్ మొదటి వారం వరకు నాలుగు రెట్లు పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘టెస్ట్, ట్రాక్ అండ్ ట్రీట్’ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం వల్ల అధిక రికవరీలు మరియు తక్కువ మరణాలు సంభవించాయని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం, భారతదేశ కేసు మరణాల రేటు 1.75 శాతంగా ఉంది.