Red Alert: హైదరాబాద్ ప్రజలకు పోలీసులు కీలక ఆదేశాలు

-

రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉండడంతో హైదరాబాద్ పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ఇళ్లలో మరియు చుట్టుపక్కల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

హైదరాబాద్ సిటీలో రాత్రిపూటకూడా ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు విధుల్లో ఉంటారని తెలిపారు సిపి సివి ఆనంద్. జిహెచ్ఎంసి మరియు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు లతో సమన్వయంగా కలిసి పని చేస్తున్నామని తెలిపారు. ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు వాతావరణాన్ని గమనించి బయటకు వెళ్లాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని ప్రజలను కోరారు సిపి సివి ఆనంద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version