పసిడి ప్రియులకి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.!

-

మీరు బంగారం కొనుక్కోవాలని ఎదురు చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నిన్న నిలకడగా ఉన్న బంగారం రేటు నేడు పడి పోయింది. ఇది నిజంగా పసిడి ప్రియులకి హ్యాపీ న్యూస్. అదే విధంగా నిన్న వెండి నిలకడగా ఉండి తగ్గిన విషయం అందరికీ తెలిసినదే.

 

ఇక బంగారం ధరలు ఎలా వున్నాయి అనేది చూస్తే.. శుక్రవారం నాడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 క్షీణించింది. రూ.49,970కు దిగొచ్చింది. ఇది ఇలా ఉంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం కూడా ఇలానే వుంది.

రూ.100 తగ్గుదలతో రూ.45,800 కి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో మాత్రం బంగారం ధర పరుగులు పెట్టింది. 0.25 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1901 డాలర్లకు ఎగసింది. ఇక వెండి రేటు చూస్తే.. వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగింది.

వెండి రేటు లో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.76,200 వద్ద నిలకడగానే కొనసాగుతోంది. నిన్న తగ్గింది కానీ నేడు స్థిరంగానే వుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 0.29 శాతం పెరుగుదలతో 28.11 డాలర్లకు ఎగసింది.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version