చార్ ధామ్ యాత్రికులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి : ఉత్తరాఖండ్ ప్రభుత్వం

-

ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవల మొదలైన యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక ఈ రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. యాత్రికులు రిజిస్ట్రేషన్ తేదీకి ముందు ప్రయాణాన్ని ప్లాన్ చేయవద్దు, గంగోత్రి, యమునోత్రికి వచ్చే వారు ముందుగా నమోదు చేసుకోవాలని ఉత్తరాఖండ్ సీనియర్ పోలీసు అధికారి ఎక్స్(ట్విట్టర్) లో వెల్లడించారు.

రిజిస్ట్రేషన్ లేని భక్తులను తీర్థయాత్రలో పాల్గొనేందుకు అనుమతించబోమని , దీనికి సంబంధించిన నియమాలను అన్ని రాష్ట్రాలకు లేఖలను పంపినట్లు తెలిపారు. యాత్ర మార్గంలో పోలీసు బృందాలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తాయని, రిజిస్ట్రేషన్ లేకుండా ప్రయాణించే వాహనాలను లోనికి అనుమతించబోమని పేర్కొన్నారు. కాగా, యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ యాత్రలతో కూడిన చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version