మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడిచేస్తున్నారా..? అయితే ఇలా చేయండి..!!

-

సాధారణంగా ఇండియన్స్‌ ఒక ముద్ద ఎక్కువైనా పర్వాలేదు.. అందరికీ సరిపడేట్లుగానే వండాలి అనే థాట్‌లో ఇళ్లలో వంట చేసుకుంటారు..దాంతో డైలీ ఎంతో కొంత ఆహారం మిగిలిపోతుంది..రాత్రి మిగిలింది ఉదయం వేడి చేసుకుని తినడం.. ఉదయం వండింది మిగిలితే రాత్రికి వేడి చేసుకుని తినడం సదా అందరి ఇళ్లలో జరిగేదే.. కానీ ఇలా మిగిలిన ఆహారాన్ని వేడి చేసుకుని తినడం ఎంత ప్రమాదకరమో తెలుసా..? ఇలా చేయడం ద్వారా పొట్టలో ఇన్‌ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే.. అది సూక్ష్మక్రిములను చంపడమే కాకుండా ఆహారంలోని పోషక విలువలు నశించిపోకుండా చూసుకుంటుంది. ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల ఆ పోషకాలు నశించిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలట..అవేంటంటే..

ఆహారాన్ని నిల్వ చేయడానికి ముందు.. పూర్తిగా చల్లబరచాలి. సాధారణ ఉష్ణోగ్రత వద్దకు చేరుకున్న ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేసుకోవాలి. మైక్రోవేవ్‌లో ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తున్నప్పుడు కనీసం 65 డిగ్రీల అంతర్గత ఉష్ణోగ్రతకు చేరుకునేలా చూసుకోవాలి. ఈ ఉష్ణోగ్రత వద్ద ఆహారంలో ఉండే హానికారక బ్యాక్టీరియా చనిపోతుంది. ఆహారాన్ని కనీసం రెండు నిమిషాల పాటు ఈ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి.

మిగిలిపోయిన వాటిని ఒక్కసారి మాత్రమే వేడి చేయాలి. చాలా సార్లు వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. అంతే కాకుండా రుచి, పోషక విలువలు కూడా తగ్గుతాయి.

ఆహారాన్ని మళ్లీ వేడి చేసిన తర్వాత ఉష్ణోగ్రత తగ్గకుండా పాత్రలపై మూత పెట్టాలి..

మాంసం వంటకాలను మళ్లీ వేడి చేస్తున్నప్పుడు గ్రిల్ థర్మామీటర్‌తో వాటి ఉష్ణోగ్రతను కొలవాలి.

మిగిలిపోయిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచకూడదు. ఇలా చేస్తే ఆహారంలో చెడు బ్యాక్టీరియా పేరుకునే అవకాశం ఉంది.

ఫ్రిడ్జ్‌లో పెట్టినవి వేడి చేయాలనుకుంటే.. తీసిన వెంటనే వేడి చేయకూడదు.. కాసేపు ఆగి అప్పుడు వేడి చేసుకోవాలి. అసలు ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టినవి వేడిచేసుకుని తినే కాన్సప్టే మంచిది కాదు..! కానీ తప్పదు అనుకుంటే మాత్రం అలా కాసేపు ఆగి వేడిచేసుకోని తినడం వల్ల కొంతలో కొంతైనా మంచిది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version