తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ : పాలిసెట్‌ నోటిఫికేషన్ విడుదల

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. తాజాగా తెలంగాణ రాష్ట్ర పాలిసెట్‌ నోటిఫికేషన్ విడుదల అయింది. ఏప్రిల్ రెండో వారం నుంచి పాలీసెట్ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇక జూన్ 4వ తేదీ వరకు పాలిసెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఉండను ఉన్నట్లు ప్రకటించింది.

అయితే జూన్ నాలుగో తేదీ వరకు అప్లై చేసుకోని వారికి కూడా…. ఓ అవకాశాన్ని కల్పిస్తోంది విద్యాశాఖ. వంద రూపాయల ఆలస్య రుసుముతో జూన్ 5వ తేదీ వరకు కూడా దరఖాస్తులు పాలిసెట్ కోసం చేసుకోవచ్చునని స్పష్టం చేసింది.

ఇది ఇలా ఉండగా… జూన్ 30వ తేదీన పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత పాలిసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది విద్యాశాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version