రైతులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు: పియూష్ గోయల్

-

ధాన్యం కొనుగోళ్లపై ఏ రాష్ట్రంపై వివక్ష చూపించడం లేదని కేంద్రమంత్రి పియూష్ గోయల్ అన్నారు. పంజాబ్ కు అనుసరిస్తున్న విధాానాన్నే తెలంగాణకు అవలంభిస్తున్నామని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నాయకులు రైతులకు తప్పుడు మాటలు చెబుతూ…తప్పుదారి పట్టిస్తున్నారంటూ…పియూష్ గోయల్ ఆరోపించారు. నాయకులు అసత్యాలతో రైతులను ఇబ్బందిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. రైతులను అడ్డంపెట్టుకుని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేఖ ప్రభుత్వం అని విమర్శించారు. ఎలాంటి భేషజాలు లేకుండా… దేశంలో ఎలాంటి విధానం అవలంబిస్తున్నామో అలాగే తెలంగాణ ధాన్యాన్ని కూడా సేకరిస్తాం అని ఆయన అన్నారు. పంజాబ్ లో ఏవిధంగా ధాన్యాన్ని సేకరిస్తున్నామో… తెలంగాణ నుంచి కూడా అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఒప్పందం చేసుకుందో.. అదే లెక్క ప్రకారం కొనుగోలు చేస్తామని పియూష్ గోయల్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం యాసంగికి సంబంధించి ఇప్పటి వరకు ఎంత ‘రా‘ రైస్ ఇస్తామనేది చెప్పలేదని పియూష్ గోయల్ అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఫిబ్రవరి 28, మార్చి 8న సమావేశానికి రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరామని… అయితే తెలంగాణ నుంచి ప్రతినిధులు రాలేదని ఆయన అన్నారు. కేంద్రం ప్రభుత్వం మార్కెట్ డిమాండ్, వినియోగం ఆధారంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం అని అన్నారు. అన్ని రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందం మేరకే కేంద్ర ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version