మరికొన్ని నెలల్లో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ఓటరు జాబితాను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నాలుగు లక్షల ఓటర్లు పెరిగినట్లు తెలిపింది. మొత్తం ఓటర్ల సంఖ్య 3.30 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. వీరిలో పురుషులు 1,64,47,132, మహిళా ఓటర్లు 1,65,87,244 మంది ఉన్నారు.
రాష్ట్రంలో 80 సంవత్సరాలు దాటిన ఓటర్లు 4,54,230 మంది, దివ్యాంగ ఓటర్లు 5,28,405 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 2,737 మంది ఉన్నారని వెల్లడించారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు కోసం ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.