రాష్ట్రానికి రావలసిన ధాన్యం సంబంధిత బకాయిలు విడుదల చేయండి..కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

-

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు.కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన ధాన్యం సంబంధిత బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ. 1,468.94 కోట్ల రాయితీని పెండింగ్‌లో పెట్టారని చెప్పారు.ఇక దీనికి సంబంధించిన పత్రాలన్నీ కేంద్రానికి సమర్పించిన విషయాన్ని కేంద్ర మంత్రికి తెలిపారు.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987.730 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులను ధ్రువీకరించుకొని అందుకు సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లను, 2021 మే నుంచి 2022 మార్చి వరకు నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్రానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version