అభినవ్ బింద్రను అరుదైన అవార్డుతో సత్కరించనున్న అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ

-

భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా ఆగస్టు 10న పారిస్‌లో జరగబోయే అవార్డు వేడుకలో ‘ ఒలింపిక్ ఆర్డర్ అవార్డు’ ను అందుకోబోతున్నాడు. ఈ అవార్డును అతడికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సత్కరించనుంది.ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ అభినవ్ బింద్రాకు లేఖ రాస్తూ ఈ సమాచారం తెలిపారు. ఒలంపిక్ మూమెంట్‌లో మీరు చేసిన ప్రశంసనీయమైన సేవకు మీకు ఒలింపిక్ ఆర్డర్‌తో సత్కరించాలని ఐఓసి ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. అవార్డు వేడుకకు అభినవ్‌ బింద్రాను కూడా ఆహ్వానించాడు. బింద్రాకు ఈ అవార్డు ఇవ్వడంపై భారత క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా ఆనందం వ్యక్తం చేశారు.

1975లో స్థాపించబడిన ఒలింపిక్ ఆర్డర్ , ఒలింపిక్ ఉద్యమంలో అత్యున్నత పురస్కారం. ఇది ఒలింపిక్ ఉద్యమానికి ప్రత్యేకించి విశిష్టమైన కృషికి అందించబడుతుంది, అంటే క్రీడల విషయంలో యోగ్యతకు తగిన ప్రయత్నాలను గుర్తించడం.

Read more RELATED
Recommended to you

Exit mobile version