లోక్‌సభ ఎన్నిక ల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ సీఎం కోర్టులో పిటిషన్ దాఖలుచేయగా… విచారణ జరిపిన ధర్మాసనం అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసింది.దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యారు.తిహార్ జైలు నుంచి విడుదలైన కాసేపట్లోనే ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజీవాల్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలతో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఆయన ధన్య వాదాలు తెలిపారు. జడ్జీల కారణంగానే తాను ఈరోజు ప్రజల ముందు ఉన్నానని చెప్పుకొచ్చారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాలని బీజేపీని ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
కాగా, లిక్కర్ పాలసీ కేసులో ఆయనను మార్చిలో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఇన్నాళ్లు తిహార్ జైలులో ఉన్నారు. జూన్ 1 వరకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తప్పనిసరిగా సరెండర్ కావాలని ఆదేశం ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కి కొన్ని షరతులు విధించింది.