సీఎం రేవంత్ రెడ్డికి ఈసీ నోటీసులు

-

 

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆయా పార్టీల నేతలు భారీ బహిరంగ సభలు, ప్రచారాలను పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.లోక్ సభ ఎన్నికలకు మూడ్రోజుల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. శుక్రవారం షోకాజు నోటీసులు జారీ చేసింది.ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం  నోటీసుల్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version