కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి గాను ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఒక్కొక్కరిగా ముందుకి వస్తున్నారు. రిలయన్స్, టాటా, విప్రో సహా పలు సంస్థలు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు సహాయం చేస్తున్నాయి. తాజాగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి గాని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తెలంగాణా ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల సాయం అందించింది.
జియో తెలంగాణా సీఈఓ కేసి రెడ్డి, ఆర్ఐఎల్ కార్పోరేట్ వ్యవహారాల అధికారి శ్రీ కమల్ పొట్లపల్లి శుక్రవారం రాష్ట్ర మంత్రి కేటిఆర్ ని కలిసి ఈ సహాయాన్ని అందించారు. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే ప్రధాన మంత్రి సహాయ నిధికి 530 కోట్ల సహాయం చేసింది రిలయన్స్. కరోనా వైరస్ తీసుకొచ్చిన సవాళ్ళను వ్యతిరేకంగా పోరాటానికి గాను మరియు గెలవడానికి గానూ దేశ౦ సిద్దంగా ఉందని రోలయన్స్ పేర్కొంది.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ సంస్థ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పటికే 100 పడకల ఆస్పత్రిని అందించిన సంగతి తెలిసిందే. ఆరోగ్య కార్యకర్తలు మరియు సంరక్షకుల కోసం ఇప్పటికే లక్ష ముసుగులను ఉత్పత్తి చేయడం తో పాటుగా… వైద్యుల కోసం పీపీఈలను తయారు చేస్తుంది. అలాగే దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సి రెస్పాన్స్ వాహనాలను అందిస్తుంది ఈ సంస్థ. అలాగే డోర్ డెలివరి ద్వారా ప్రజలకు అత్యవసర సరుకులను అందిస్తున్న సంగతి తెలిసిందే.
దీనిపై మంత్రి కేటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ముఖేష్ అంబానికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసి తమకు సహాయం అందింది అని పేర్కొన్నారు.
Huge thanks to Shri Mukesh Ambani Ji, Chairman and Managing Director of Reliance Industries Limited, and Shri KC Reddy CEO-Telangana @reliancejio for contributing Rs 5 Crore to Telangana CM Relief Fund. This will help bolster our fight against the #Coronavirus pandemic. pic.twitter.com/kyVUeoM99I
— KTR (@KTRTRS) April 10, 2020